Tuesday, June 21, 2016

ఆదిత్య హృదయం-- విశిష్టత

ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణం లో యుద్ద కాండలో చెప్పబడింది. ఈ స్తోత్ర పారాయణం అనేక సమస్యలను తొలగిస్తుంది.  ఆర్ధిక, ఋణ సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణం తగ్గిస్తుంది.  ముఖ్యంగా నేత్ర సమస్యలకు ఈ స్తోత్రం బాగా ఉపకరిస్తుంది.  తీవ్ర వృత్తి సమస్యలలో ఉన్న వారు,  జాతకంలో రవి గ్రహంచే బాధలు పొందేవారు మరియు 1, 10, 19,28 తేదీలలో జన్మించిన వారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ 6 సార్లు పారాయణం చేస్తూ ఆదివారాలందు పగటిపూట ఉపవాసం ఉండాలి. ఈ విధంగా 60 రోజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 60 రోజులు అన్ని నియమాలను  పాటించాలి. అదే విధంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్నవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తూ ఆదివారాలందు గోమాతకు గోధుమలను నివేదించాలి. వీలుంటే ఆదివారములందు సూర్యదేవాలయంలో 60 ప్రదక్షిణాలు చేసి 36 సార్లు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. యే కోరికను ఆశించకుండా ఈ స్తోత్రంను ప్రతిరోజూ చదివినట్లైతే  అన్ని సమస్యలు తొలగి  సూర్య సాయుజ్యన్ని పొందుతారు. రధసప్తమి రోజు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే సమస్త భోగాలు లభిస్తాయి. .

మహామహితాన్వితమైన ఈ స్తోత్రంను ప్రతిరోజూ సూర్యభగవానునకు అభిముఖంగా నిలబడి ప్రతి రోజు పారాయణం చేస్తే అన్నీ జాడ్యాలు నశిస్తాయి. పూజా మందిరం లో లేదా గృహంలో ఎక్కడైనా కూర్చుని చదువుకోవచ్చు. మంచి ఫలితాలకు ప్రతి రోజు సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాలలో పారాయణం చేయాలి.. ఇంతటి మహిమ కలిగిన ఈ స్తోత్రం  ఈ క్రింద ఉదహరింపబడింది. అందరూ తప్పనిసరిగా ప్రతిరోజు  పారాయణం చేసి సకల రోగ,ఋణ ఆర్ధిక మరియు వృత్తిబాధల నుండి విముక్తిని పొందండి.



 ఆదిత్యహృదయం



తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

Thursday, June 16, 2016





సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ – మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః || ౧ ||
న జానామి శబ్దం న జానామి చార్థం – న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||
మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||
యదా సంనిధానం గతా మానవా మే – భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే – తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||
యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||
గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢాస్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః – స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు || ౬ ||
మహాంభోధితీరే మహాపాపచోరే – మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం – జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||
లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే – సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం – సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||
రణద్ధంసకే మంజులేఽత్యంతశోణే – మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః – సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||
సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం – క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||
పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామ్యహం తారకారే తవోరః – స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||
విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాన్జగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||
సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః – సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||
స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో – తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||
విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం – దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||
సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా – జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||
ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం – హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||
కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ – ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||
ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||
కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింద్ధి భింద్ధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం – పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||
ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో ప్రార్థయేఽనేకవారమ్ |
న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే – న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||
సహస్రాండభోక్తా త్వయా శూరనామా – హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం – న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||
అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||
అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||
దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||
మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే – గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||
కలత్రం సుతా బంధువర్గః పశుర్వా – నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం – స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||
మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే – వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||
జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||
నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కందమూర్తే నమస్తే నమోఽస్తు || ౩౧ ||
జయానందభూమం జయాపారధామం – జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో – జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||
భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
స పుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||

ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ను ఎవరైనా ప్రతిరోజు పారాయణం చేయవచ్చు.జాతకంలో కాలసర్పదోషంతో ఉన్నవారు, మరియు వివాహం, ఉద్యోగ సమస్యలతో ఉన్నవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం లేనివారలు, తీవ్ర ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడేవారలకు ఈ స్తోత్రం కల్పతరువులా పనిచేయగలదు.

శీఘ్ర వివాహం, సంతానం మరియు ఉద్యోగం కోసం ఈ స్తోత్రం ను ప్రతి రోజు 3, 9 లేదా 11 సార్లు పారాయణం చేయాలి. ఈ పారాయణం చేసే రోజులలో అన్నీ నియమాలను పాటిస్తూ  షష్టి తిధి రోజులందు స్వామి వారికి పంచామృతా భిషేకం మరియు అర్చన చేయాలి. మంగళవారం రోజున ఒక్కపుట ఉపవాసం ఉండాలి.

జాతకం లో కాలసర్పదోషం ఉన్నవారు ఈ స్తోత్రం ను తప్పక ప్రతిరోజూ చదివితే దోషం క్రమంగా తొలగిపోతుంది. వివాహం, సంతానం మరియు ఉద్యోగం కావాలను కొనే వారు ఈ స్తోత్రం ను తప్పనిసరిగా చదవాలి. సకల మానసిక మరియు ఆనారోగ్య దోషాలకు ఇది దివ్య ఔషదమ్. ఈ స్తోత్రంను  ప్రతిరోజూ చదివితే సకల జాడ్యాలు నశించి  అన్నీ కోరికలు సిద్ధిస్తాయి.

సందేహాలకు  సంప్రదించండి........

venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్   M. A జ్యోతిష్యం.

సుందరయ్య నగర్    మధిర     ఖమ్మం జిల్లా  తెలంగాణా.
507203

Saturday, June 11, 2016

DEVI KHADGAMAALA- IMPORTANCE...


Khadgamala

There are many types and levels of worship of the Devi(s) of the Sri Chakra. The Khadgamala is the simplest way. It is simply reciting the names of all the Devis of the Sri Chakra. The following is the sequence in which the names should be recited. It is very good for all round protection and progress. If recited when you are tired and exhausted, it is an excellent rejuvenator of the body, mind and the soul.

Om Aim Hrim Srim Aim Klim Souh
Om Namah Tripura Sundari, Hridayadevi, Sirodevi, Sikhadevi, Kavaca Devi, Netra Devi, Astra Devi
Kamesvari, Bhagamalini, Nityaklinne, Bherunde, Vahnivasini, Mahavajresvari, Sivaduti, Tvarite, Kulasundari, Nitya, Nilapatake, Vijaye, Sarvamangale, Jvalamalini, Citre, Mahanitye, Paramesvara Paramesvari
Mitresamayi, Sasthisamayi, Uddisamayi, Caryanathamayi, Lopamudramayi, Agastyamayi, Kalatapanamayi, Dharmacaryamayi, Muktakesisvaramayi, Dipakalanathamayi, Visnudevamayi, Prabhakara devamayi, Tejodevamayi, Manojadevamayi, Kalyanadevamayi, Vasudevamayi, Ratnadevamayi, Sri Ramanandamayi
Anima Siddhe, Laghima Siddhe, Garima Siddhe, Mahima Siddhe, Isitva Siddhe, Vasitva Siddhe, Prakamya Siddhe, Bhukti Siddhe, Iccha Siddhe, Prapti Siddhe, Sarvakama Siddhe, Brahmi, Mahesvari, Koumari, Vaisnavi, Varahi, Mahendri, Camunde, Mahalaksmi, Sarva Samksobhini, Sarva Vidravini, Sarva karsini, Sarva Vasamkari, Sarvonmadini, Sarva Mahankuse, Sarva Khecari, Sarva Bije, Sarva Yone, Sarva Trikhande, Trilokya mohana cakra swamini Prakata yogini
Kamakarsini, Buddhyakarsini, Ahamkarakarsini, Sabdhakarsini, Sparsakarsini, Rupakarsini, Rasakarsini, Gandhakarsini, Cittakarsini, Dharyakarsini, Smrityikarsini, Namakarsini, Bijakarsini, Atmakarsini, Amrtakarsini, Sarirakarsini, Sarvasa paripuraka cakra svamini Gupta yogini
Ananga Kusume, Ananga Mekhale, Ananga Madane, Ananga Madananture, Ananga Redhe, Ananga Vegini, Ananga Kusume, Ananga Malini, Sarva sanksoghana sadhaka cakra swamini Gupta tara yogini
Sarva Samksobhini, Sarva Vidravini, Sarva Karsini, Sarva Hladini, Sarva Sammohini, Sarva Stambini, Sarva Jrumbhini, Sarva Vasamkari, Sarva Ranjani, Sarvonmadini, Sarvarthasadhini, Sarva Sampattipurani, Sarva Mantra Mayi, Sarva Dvandva Ksayamkari, Sarva Soubhagya Dayaka Cakra Swamini Sampradaya yogini
Sarva Siddhiprade, Sarva Sampatprade, Sarva Priyamkari, Sarva Mangalakarini, Sarva Kamaprade, Sarva Duhkha Vimocani, Sarva Mrityu Prasamani, Sarva Vigna Nivarani, Sarvanga Sundari, Sarva Soubhagya Dayini Sarvartha Sadhaka Cakra Swamini Kulottirna yogini
Sarva Jne, Sarva Sakte, Sarvaisvarya pradayini, Sarva Jnanamayi, Sarva Vyadhivinasini, Sarvadharasvarupe, Sarva Papa Hare, Sarva Ananda Mayi, Sarva Raksa Svarupini, Sarvepsita Phala Prade, Sarva Raksakara Cakra Svamini Nigarbha yogini
Vasini, Kamesvari, Modini, Vimale, Arune, Jayini, Sarvesvari, Kaulini, Sarvarogahara Cakra Swamini Rahasya yogini Banini, Capini, Pasini, Ankusini
Maha Kamesvari, Maha Vajresvari, Maha Bhagamalini, Sarva Siddhiprada Cakra Swamini Ati Rahasya yogini Sri Sri Maha Bhattarike Sarvananda Maya Cakra Swamini Parapara Rahasya Yogini
Tripure, Tripuresi, Tripurasundari, Tripura Vasini, Tripura Srih, Tripuramalini, Tripura Siddhe, Tripurambe, Maha Mahesvari, Maha Maha Rajni, Maha Maha Sakte, Maha Maha Gupte, Maha Maha Jnapte, Maha Mahannande, Maha Maha Skandhe, Maha Mahasaye, Maha Maha Sri Cakra Nagara Samrajni
Sri Lalita Tripura Sundar Padukam Poojayami Tarpayami Namah.


Daily readind and reciting of above stotram solves many problems. If problems are at high level better to read this stotram 11 times or 3 times in a day.  For good results better to read SHRI LALITHA SAHASRANAAMA STOTRAM, along with this DEVI KHADGAMAALA. No upadesam is required to read this stotram. Anybody can do parayana of this stotram.

MAY GODESS LALITHA BLESS YOU ALL WITH HEALTH AND WEALTH.........

Thursday, June 2, 2016

ఈ సం|రం లో వృశ్చిక రాశిలో కుజస్తంభనయోగం మరియు సింహా రాశి లో గురు రాహు గ్రహాల కలయిక , గురుగ్రహం అతిచారం చేత తుల రాశి ప్రవేశం , ఒకే చాంద్రమానం లో గురుగ్రహం 3 రాశులలో (సింహా, కన్య, తుల ) సంచరించడం వలన  ఇంకా ది 02-10-2016 నుండి ది 08-12-2016 వరకు కాలసర్ప యోగం ఉండుట వలన దేశానికి, ప్రపంచానికి అనేక అరిష్ట యోగాలు ఉంటాయి.ప్రపంచం లో యుద్ద వాతావరణం ఉంటుంది, ప్రకృతివైపరీత్యాలు ఉండగలవు. వాహన ప్రమాదాలు, బస్ ,రైలు మరియు వాయు ప్రమాదాలు, భూకంపాలు, తుఫానులు రాగలవు. పాలక పక్షానికి సమస్యలు, రాజకీయ నేతలు మరియు వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్టులకు తీవ్ర సమస్యలు మరణాలు రావచ్చును. 

ఈ కాలం నందు ఎవరికి వారు పరిహారాలు చేసినట్లైతే సమస్యలు తగ్గగలవు. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి గ్రామం లో గల శివాలయాలో విశేష అభిషేకాలు, రుద్ర మరియు చండీ హోమాలు, ఇంకా చండీ సప్తశతి పారాయణాలు, లలిత సహస్ర పారాయణాలు చేసినట్లైతే సమస్యలు తగ్గగలవు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పూజలు, అభిషేకాలు, నవగ్రహ పూజలు హోమాలు చేసినట్లైతే మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వాలు ఈ విధమైన పరిహారాలు చేయించుట మంచిది.


వృశ్చిక, తుల, ధను, మేష సింహా రాశుల వారు ఈ కాలం లో అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.. వీరికి  అనేక విధమైన సమస్యలు రాగలవు. కనుక ఈ రాశులలో జన్మించిన వారు యధా శక్తి శని గ్రహానికి అభిషేకం జరిపించాలి. దుర్గా, సుబ్రహ్మణ్య స్వామి వారలకు విశేష అర్చనలు చేయాలి. ప్రతిరోజూ విష్ణు, లలిత సహస్రనామ స్తోత్రం మరియు చండీ కవచం ఇంకా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవాలి. ఎవరికి వారు రుద్ర మరియు చండీ హోమాలు చేయించుకోవాలి.

సంధ్యవందనం అర్హత ఉన్నవారలు తప్పనిసరిగా సంధ్యావందనాలు ఆచరించాలి. తద్వారా ప్రపంచ శాంతి లభిస్తుంది.