సమగ్ర వాస్తు,జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర, యోగా విశ్లేషణ........ సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
Wednesday, March 29, 2017
Monday, March 20, 2017
Suryadevara Venugopal: ఇంటికి ప్రహరీ రక్షణ కవచం
Suryadevara Venugopal: ఇంటికి ప్రహరీ రక్షణ కవచం: ఇంటికి ప్రహరీ రక్షణ కవచం. సూర్యదేవర వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం) నైసర్గిక వాస్తు దోషాలను అరికడుతుంది . గృహానికి ప్రహరీ లేకపోతే ఆ ...
ఇంటికి ప్రహరీ రక్షణ కవచం
ఇంటికి ప్రహరీ రక్షణ కవచం.
సూర్యదేవర
వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)
నైసర్గిక వాస్తు
దోషాలను అరికడుతుంది. గృహానికి ప్రహరీ లేకపోతే ఆ గృహం చుట్టూ ఉన్న వాస్తు
దోషాల వలన అందులో ఉండేవారు బాధపడవలసి వస్తుంది.
అష్ట దిక్కులను మన గృహానికి అనుగుణంగా సవరించుకొని మేలు పొందాలంటే ప్రహరీ
నిర్మాణం తప్పనిసరి. ప్రహరీ గోడను అనుభవం కలిగిన వాస్తు పండితుని
పర్యవేక్షణలో నిర్మించాలి. పెరిగి ఉన్న మూలాలను,దిక్కులను సవరించి ప్రహరిని నిర్మించాలి. స్థలం ఉన్నంత
మేరకు ప్రహరీని కట్టకూడదు. మంచి ఫలితాల కోసం దిక్కులను సవరించి
ప్రహరిని కట్టాలి. యే నిర్మాణానికైనా ప్రహరీ తప్పనిసరి. గృహానికి
ప్రహరీ చాలా ముఖ్యం. ప్రహరీలు లేని గృహం రాణించదు.
ప్రహరీ నిర్మాణ
సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రహరి పునాది లేదా ఫౌండేషన్
ఎట్టి పరిస్థితిలోను ఇంటి పునాదిని మించకూడదు. ఇంటిపునాది కంటే
ప్రహరీ పునాది ఎత్తులో ఉంటే ఇంటి ఆయుర్దాయం తగ్గిపోతుంది. దక్షిణం
మరియు పడమర లు ఎత్తులో ఉండాలని కొంతమంది ఇంటి పునాది కంటే ప్రహరీ పునాది ని ఎత్తులో
కడుతున్నారు. ఇది చాలా తప్పు. అన్ని దిశలందు
ప్రహరీ ఫౌండేషన్ ఇంటి ఫౌండేషన్ కన్నా తక్కువలోనే ఉండాలి.
ప్రహరీలకు తూర్పు
ఉత్తరంలో కట్టే ఫౌండేషన్ దక్షిణం పడమరల ఫౌండేషన్ కన్నా తక్కువ ఎత్తులో ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రహరీ నిర్మాణం 2 విధాలుగా ఉంటుంది. 4 దిక్కులందు
సమానమైన ఎత్తులో ప్రహరీ నిర్మించుట ఒక పద్దతి. తూర్పు ప్రహరీ
పడమర ప్రహరీ కన్నా తక్కువలో మరియు దక్షిణం ప్రహరీ ఉత్తరం ప్రహరీ కన్నా ఎత్తులో ఉంచి
ప్రహరీ నిర్మించుట 2 వ పద్దతి. ఈ రెండింటిలో
2 వ పద్దతి సరియైనది. ప్రహరీ కట్టేటప్పుడు
కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ముందుగా గృహానికి దక్షిణం, పడమరల వైపు ప్రహరీని నిర్మించాలి. ఈ దిక్కులందు ప్రహరీ లేకుండా తూర్పు, ఉత్తర దిశలందు కాంపౌండ్ నిర్మించరాదు. పడమర,దక్షిణాల
వైపు జలాశయాలు, బావులు, బొర్లు, లోతైన గుంటలు, పెద్ద డ్రైనేజీలు ఉన్నప్పుడూ కొంత స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. ఈ పల్లపు ప్రాంతాలను
ఆనుకొని ప్రహరీ కట్టకూడదు. కనీసం 5 నుండి 12 అడుగుల వరకు ఖాళీ స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి.
అప్పుడే ప్రహరీ వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా పడమర దక్షిణ ముఖాలుగా నిర్మించే
గృహాల కు నైరుతి ప్రాంతం నందు ప్రహరికి ఆనించి మెట్లను నిర్మిస్తున్నారు ఇది తప్పు.
అదేవిధంగా నైరుతి మూసివేయాలని మరుగుదొడ్లు లేదా స్టోర్ రూమ్స్ నైరుతిని మూసివేసి నిర్మిస్తున్నారు
ఇది కూడా చాలా తప్పు. ఈ విధమైన నిర్మాణాల వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ఇటువంటి నిర్మాణాలు
వలన కాంపౌండ్ బయట ఉన్న పల్లంతో తీవ్ర నష్టం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో కాంపౌండ్
కు టచ్ చేసి మరుగుదొడ్లు నిర్మించవలసి వస్తే తప్పనిసరిగా కాంపౌండ్ బయట మట్టి వేసి ఎత్తు
చేయాలి. కాంపౌండ్ బయట పల్లం లేకుండా మట్టి వేసి ఎత్తు లేపడం గాని లేదా అరుగులు వంటివి
కట్టడంగాని చేయాలి. ప్రహరీ గోడకు గృహం లోని యే భాగము టచ్ కాకుండా నిర్మించడం మంచిది.
తూర్పు ఉత్తర
సింహద్వారం తో నిర్మించే గృహాలకు సింహద్వారం బయటకు కనిపించే విధంగా ప్రహరీ నిర్మించాలి.
తూర్పు ఉత్తరాలలో బాగా ఎత్తులో ప్రహరి నిర్మించుట మంచిది కాదు. మగ సంతానానికి ఎదుగుదల
లోపిస్తుంది. అయితే దక్షిణ పశ్చిమ దిశలలో ప్రహరీని ఎత్తులో ఉంచవచ్చు. తూర్పు ఉత్తరాలలో మరీ ఎత్తులో
ప్రహరీ మంచిది కాదు. దక్షిణం, పడమరల వైపు కూడా గాలికి అవరోధం రానంత మేర
ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. మన పూర్వ నిర్మాణాలలో దక్షిణం,పడమరల
వైపు ఇంటిని ఖాయం చేసి ఉండటం మనం చూస్తూంటాము. ఇది చాలా తప్పు. ఇటువంటి గృహాలకు నైసర్గిక
వాస్తు దోషాలు బాగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది నైరుతి మూసి నిర్మాణాలు చేయవచ్చునని
సలహా ఇస్తున్నారు. ఇది కూడా తప్పు. నైరుతి మూసి నిర్మాణాలు చేస్తే ఇటువంటి నిర్మాణాలకు
నైరుతి లో ఉండే నైసర్గిక వాస్తు దోషం తగిలి తీవ్ర నష్టాలు వస్తాయి. ఇంటికి దక్షిణం
పడమర లో వేరే గృహం ఉంటే ఈ దిక్కులందు కాంపౌండ్ అవసరం లేదని భావిస్తారు.ఇది తప్పు. మన
ప్రహరీ మనం కట్టుకోవలసిందే.
ప్రహరి ప్రధాన
గృహం నుండి దక్షిణం ఆగ్నేయ, దక్షిణ నైరుతి దిక్కులు సమానమైన కొలతతో 90 డిగ్రీలు
గా ఉండాలి. అదేవిధంగా పడమర వైపు పడమర, పడమర వాయవ్యం, పశ్చిమ నైరుతి ప్రధాన గృహం నుండి సమానమైన కొలతతో 90 డిగ్రీలు గా ఉండాలి. ఏ దిశ పెరగరాదు. అయితే తూర్పు ఉత్తరం వైపు తూర్పు ఆగ్నేయం కన్నా
తూర్పు ఈశాన్యం అదే విధంగా ఉత్తర వాయవ్యం కన్నా ఉత్తర ఈశాన్యం ఎంతో కొంత పెరిగే విధంగా
ప్రహరీ నిర్మించాలి. ఈశాన్యం పెరగకుండా ఉండరాదు. ఇంటి ప్రహరీ గోడ కు వీధి శూల తగిలే
పక్షంలో నిర్లక్ష్యం చేయరాదు. ప్రహరీ కి ఎంతో కొంత ఖాళీ వదలి వేరే గోడను ప్రహరీ కి
అడ్డం గా నిర్మించాలి. అప్పుడే ప్రహరీ కి వీధి శూల నుండి రక్షణ లభిస్తుంది.
ఈ రోజుల్లో
చాలామంది ప్రహరిలను ఇంటి బీముల పై నిర్మిస్తున్నారు. ఇంటి బీమ్స్ ను ఇంటి నుండి బయటకు
పెంచి వాటిపై ఇంటికి ఎడంగా ప్రహరిని కడుతున్నారు. భూమి పై మట్టం నుండి కాంపౌండ్, ఇంటి
గోడలు ఎడంగా ఉన్నప్పటికి భూమి అడుగు భాగంలో ప్రధాన గృహం మరియు ప్రహరీలు బీమ్స్ ద్వారా
కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇటువంటి నిర్మాణం వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ప్రహరీ ఇంటికి
మద్య ఖచ్చితంగా కనెక్షన్ ఉండకూడదు. ఇంటికి ప్రహరీ మధ్య కనెక్షన్ ఉంటే ప్రహరీలకు తగిలే
నైసర్గిక వాస్తు దోషాలు ఇంటికి కూడా తగిలి అనేక సమస్యలు వస్తాయి. కనుక ప్రహరీలకు వేరే
పిల్లర్స్, బీమ్స్ వేసి ప్రహరిని నిర్మించాలి.
ఇంటి శ్లాబ్స్
ప్రహరీ గోడలపై వచ్చే విధంగా నిర్మించరాదు. ఇంటి శ్లాబ్ ఇంటి ప్రహరి కన్నా 2 లేక 3 అంగుళాలు
లోపలికి ఉండే విధం గా వేయాలి. సెప్టిక్ టాంకులు,బోర్లు మొ|నవి ప్రహరికి టచ్ కాకుండా ఉండాలి.ప్రహరీ పై ఇంటికన్నా ఎత్తులో ఆర్చీలు డిజైన్లు
కట్టరాదు. క్రూర మృగాల బొమ్మలు, భయం గొలిపే బొమ్మలు ప్రహరీపై
ఉంచరాదు. ఇంకా ప్రహరీ పై గాజు పెంకు లను అమర్చకూడదు. ఇంటిని నిర్మించిన తదుపరి ప్రహరిని
నిర్మించుట మంచిది. ఇంటిని ప్రాతిపదికగా తీసుకొని ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటికన్నా
ప్రహరీ ముందుగా నిర్మిస్తే ఇంటిని ప్రహరికి అనుగుణంగా సవరించాలి. ఇది మంచి పద్దతి కాదు.
అయితే ఖాళీ స్థలానికి నైరుతి ఆగ్నేయ దిక్కుల విపరీతంగా పెరిగిఉంటే ముందుగా పెరిగి ఉన్న
దిక్కులను సవరించి ప్రహరీ నిర్మించాలి. అప్పుడు ఇల్లు సకాలంలో పూర్తి అవుతుంది.
ప్రహరికు ఉచ్చ
స్థానంలో గేట్లు అమర్చాలి. ప్రహరికి కాలువలకు మధ్య ఎంతోకొంత ఖాళీ ఉండాలి. ప్రహరికి
ఆనుకొని కాలువలు ఏ దిశలోనూ ఉండరాదు. పాత గృహానికి కాంపౌండ్ నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తలు
తీసుకోవాలి. ప్రధాన గృహానికి పారు చెడకుండా ప్రహరీ కట్టాలి. అదే విధంగా ప్రధాన గృహం
ను ప్రాతిపదిక గా తీసుకొనే ప్రహరీ కట్టాలి. ప్రధాన గృహం నుండి కొలత తీసుకొని ప్రహరీ
కట్టాలి. అంతేకాని ప్రహరికి నూతనంగా మూలమట్టం వేసి కట్టకూడదు. ఇంటిపారు లోనే ప్రహరీ
ఉండాలి. ప్రహరీ గోడలు అన్నీ సమానమైన మందం తో నిర్మించాలి. దక్షిణ పడమరల వైపు ఎక్కువ
మందం తో నిర్మించి తూర్పు ఉత్తరాలలో తక్కువ మందంతో ప్రహరీ నిర్మించవచ్చు. ఇలా కాకుండా
తక్కువ మందంతో ప్రహరీ ని దక్షిణ పడమరలలో నిర్మించి ఎక్కువ మందంతో తూర్పు ఉత్తరాలలో
ప్రహరి కట్టరాదు. 4 వైపులా సమానమైన మందంతో ప్రహరీ కట్టవచ్చును. ఇంటి సింహద్వారంలో గాని
ఇతర దర్వాజలో కాని ప్రహరీ గోడ పిల్లర్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా బోర్లు టాంకులు
మరియు బావులందు ప్రహరీ పిల్లర్లు రాకూడదు.
ప్రహరికి అమర్చే గేట్లు తూర్పు ఉత్తరాలలో ఇంటికన్నా తక్కువ ఎత్తులో
ఉంచితే మంచిది. దక్షిణ పడమరల వైపు ఎత్తులో వుంచవచ్చు. అయితే ప్రహరీ గోడ నైరుతి లో ఉన్న
ఎత్తుకంటే ఈ గేట్లు ఎత్తులో ఉండరాదు. ప్రహరీ గోడ మధ్య చెట్లు ఉండకూడదు. ఈ విధంగా అన్ని
జాగ్రత్తలు తీసుకొని ప్రహరీ నిర్మిస్తే నైసర్గిక
వాస్తు దోషాలు తొలగి సుఖ సౌఖ్యాలు పొందవచ్చు.
సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం
H.NO—1-879 సుందరయ్య నగర్ మధిర
ఖమ్మం జిల్లా తెలంగాణా
Subscribe to:
Posts (Atom)