Saturday, April 4, 2020

శని దోషం - పరిహారాలు ||ధనుస్సు,మకర,కుంభ,మిధున, తుల రాశి వారికి






శని దోషం- పరిహారాలు

సూర్యదేవర వేణుగోపాల్ M. A. (జ్యోతిష్యం)
ప్రస్తుతం ధనుస్సు, మకర, కుంభ  రాశుల వారికి ఎల్నాటి శని నడుస్తుంది. మిధున రాశి వారికి అష్టమ శని దోషం నడుస్తుంది. ఇంకా తులా వారికి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. చేసే ప్రతి పనిలోనూ ఆటంకం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, వివాదాలు, కొన్ని విషయాలలో అవమానాలు ఈ రాశుల వాళ్ళకి   ఉండే  అవకాశం ఉంటుంది. ఆరోగ్య ఆర్ధిక సమస్యలు వేధించవచ్చు. ఉద్యోగం లో సమస్యలు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరాశ మిగలవచ్చు. ఇవన్నీ సాధారణంగా శని గోచరం వల్ల కలిగే ఫలితాలు. జాతకం లో నడుస్తున్న దశ అంతర్దశ ల ప్రభావం వల్ల ఈ ఫలితాలల్లో మార్పు ఉండవచ్చు. 2023 వ సం|రం జనవరి వరకు మిధున తుల ధనుస్సు రాశుల వారికి , 2027 చివరి వరకు మకర, కుంభ రాశుల వారికి శని దోష ప్రభావం ఉంటుంది. జాతకం లో శని స్వక్షేత్రం లో గాని, ఉచ్చలో లో గాని ఇంకా మిత్ర స్థానాలలో గాని ఉంటే అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు...
పైన ఉదహరించిన రాశుల వారు శని దోష నివృత్తి కై ఈ క్రింది పరిహారాలు పాటించాలి....
*నెలకు 1 శనివారం శని భగవానునకు తైలాభిషేకం చేయాలి.
*ప్రతి మాస శివరాత్రికి శివాలయం లో రుద్రాభిషేకం జరిపించాలి.
*ప్రతి రోజు హనుమాన్ చాలీసా పఠించాలి....వీలుంటే రోజుకి 11 సార్లు చదవడం మంచిది.
*విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం కూడా శని దోషాన్ని హరిస్తుంది. డైలీ చేయండి.
*స్తోత్రాలు చదవలేని వాళ్ళు ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణలు చేయవచ్చు.
*ప్రతి రోజు కాలభైరవ స్తోత్రం, కాళి స్తోత్రం చదవవచ్చు.
*దత్తాత్రేయుని నిత్య పూజ లేదా స్తోత్ర పఠనం శని దోషాన్ని హరిస్తుంది.
*శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయిస్తే చాలా మంచిది.
*ప్రతిరోజు శని స్తోత్రం, లేదా శని శ్లోకం తప్పనిసరిగా పఠించాలి.
ఈ పరిహారాలు పాటిస్తే శని భగవానుని ఆశీస్సులతో బాధలు తగ్గుతాయి.

సూర్యదేవర వేణుగోపాల్  M. A (జ్యోతిష్యం)
ఇంటి నెం  1-879సుందరయ్య నగర్
 మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా  507 203
Venusuryadevara@gmail.com


Wednesday, April 1, 2020

శ్రీ రామ రక్షా స్తోత్రం





శ్రీ రామ రక్షా స్తోత్రం

బుధ కౌశిక మునిచే విరచితమైన శ్రీ రామ రక్షా స్తోత్రం చాలా మహిమాన్వితమైనది. ఈ స్తోత్ర పారాయణం వల్ల సకల గ్రహ దోషాలు, భయం, ఆందోళన, అనారోగ్యం నశిస్తాయి. ప్రతిరోజూ ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ శ్రీ రామ చంద్ర మూర్తి కి క్షీరాన్నం నివేదన  శుక్రవారం చేస్తూ ఉంటే శ్రీ రామకృప తో పాటు, రుద్రమూర్తి అయిన శ్రీ మారుతి కృప కూడా లభిస్తుంది. భక్తుల పాలిటి కల్పవృక్షం ఈ స్తోత్రం. అన్ని కోరికలు తీర్చే చింతామణి ఇది.

||శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే నమః||

శ్రీ రామ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః

ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్

స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః

సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామోఽఖిలం వపుః

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్

పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్

ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ

ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః

వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే

మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే

దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం

శ్రీరామ జయరామ జయజయరామ
||శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే నమః||

సూర్యదేవర వేణుగోపాల్  M. A (జ్యోతిష్యం)
ఇంటి నెం  1-879సుందరయ్య నగర్
 మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా  507 203
Venusuryadevara@gmail.com

Monday, March 30, 2020

ధన్వంతరి స్తోత్రం-సకల రోగనివారిణి




ధన్వంతరీ స్తోత్రం
దేవ వైద్యులైన ధన్వంతరి స్తోత్రం ఇది. ధన్వంతరిని  God  of Ayurveda అని అంటారు. ధన్వంతరి కృప కలిగితే  సకల జాడ్యాలు నశించి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. సకల పాప కర్మల్ని నశింపజేసి మంచి ఆరోగ్యాన్ని ధన్వంతరి కలిగిస్తారు.
శ్రీ నారాయణ స్వరూపమైన  ధన్వంతరిని ఆరోగ్యం కోసం  పూజించాలి. ప్రస్తుత పరిస్తితి లో కరోన వైరస్ విజృంభిస్తోంది. ఇటువంటి విష రోగాల నివారణకు నారాయణ స్వరూపమైన ధన్వంతరి కృప అందరికీ అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు పఠించండి. అపాయం నుండి తక్షణమే రక్షణ కలుగుతుంది. దేశ రక్షణకు స్వీయ రక్షణకు ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు పఠించడం అందరికీ అవసరం. ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం పఠించండి.
స్తోత్ర చివర ఇవ్వబడిన ధన్వంతరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. స్తోత్రం  రోజుకి 3 సార్లు చదువలేని వారు ఈ మంత్రాన్ని 11 సార్లు  ఉదయం,
11 సార్లు మధ్యాన్నం, 11 సార్లు సాయంత్రం జపం చేసుకోవచ్చు.
||ఓం నమో నారాయణాయ||


శ్రీ ధన్వంతరి స్తోత్రం

నమో నమో విశ్వవిభావనాయ
నమో నమో లోకసుఖప్రదాయ
నమో నమో విశ్వసృజేశ్వరాయ
నమో నమో నమో ముక్తివరప్రదాయ
నమో నమస్తేఽఖిలలోకపాయ
నమో నమస్తేఽఖిలకామదాయ
నమో నమస్తేఽఖిలకారణాయ
నమో నమస్తేఽఖిలరక్షకాయ
నమో నమస్తే సకలార్త్రిహర్త్రే
నమో నమస్తే విరుజః ప్రకర్త్రే
నమో నమస్తేఽఖిలవిశ్వధర్త్రే
నమో నమస్తేఽఖిలలోకభర్త్రే

సృష్టం దేవ చరాచరం జగదిదం బ్రహ్మస్వరూపేణ తే
సర్వం తత్పరిపాల్యతే జగదిదం విష్ణుస్వరూపేణ తే
విశ్వం సంహ్రియతే తదేవ నిఖిలం రుద్రస్వరూపేణ తే
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ
యో ధన్వన్తరిసంజ్ఞయా నిగదితః క్షీరాబ్ధితో నిఃసృతో
హస్తాభ్యాం జనజీవనాయ కలశం పీయూషపూర్ణం దధత్
ఆయుర్వేదమరీరచజ్జనరుజాం నాశాయ స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ
స్త్రీరూపం వరభూషణామ్బరధరం త్రైలోక్యసంమోహనం
కృత్వా పాయయతి స్మ యః సురగణాన్పీయూషమత్యుత్తమమ్
చక్రే దైత్యగణాన్ సుధావిరహితాన్ సంమోహ్య స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ
చాక్షుషోదధిసమ్ప్లావ భూవేదప ఝషాకృతే
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ

పృష్ఠమన్దరనిర్ఘూర్ణనిద్రాక్ష కమఠాకృతే
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ
ధరోద్ధార హిరణ్యాక్షఘాత క్రోడాకృతే ప్రభో
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ
భక్తత్రాసవినాశాత్తచణ్డత్వ నృహరే విభో
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౦
యాఞ్చాచ్ఛలబలిత్రాసముక్తనిర్జర వామన
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౧
క్షత్రియారణ్యసఞ్ఛేదకుఠారకరరైణుక
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౨
రక్షోరాజప్రతాపాబ్ధిశోషణాశుగ రాఘవ
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౩
భూభరాసురసన్దోహకాలాగ్నే రుక్మిణీపతే
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౪

వేదమార్గరతానర్హవిభ్రాన్త్యై బుద్ధరూపధృక్
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౫
కలివర్ణాశ్రమాస్పష్టధర్మర్ద్ద్యై కల్కిరూపభాక్
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ౧౬
అసాధ్యాః కష్టసాధ్యా యే మహారోగా భయఙ్కరాః
ఛిన్ధి తానాశు చక్రేణ చిరం జీవయ జీవయ ౧౭
అల్పమృత్యుం చాపమృత్యుం మహోత్పాతానుపద్రవాన్
భిన్ధి భిన్ధి గదాఘాతైః చిరం జీవయ జీవయ ౧౮
అహం న జానే కిమపి త్వదన్యత్
సమాశ్రయే నాథ పదామ్బుజం తే
కురుష్వ తద్యన్మనసీప్సితం తే
సుకర్మణా కేన సమక్షమీయామ్ ౧౯
త్వమేవ తాతో జననీ త్వమేవ
త్వమేవ నాథశ్చ త్వమేవ బన్ధుః
విద్యాహినాగారకులం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ ౨౦
న మేఽపరాధం ప్రవిలోకయ ప్రభోఽ-
పరాధసిన్ధోశ్చ దయానిధిస్త్వమ్
తాతేన దుష్టోఽపి సుతః సురక్ష్యతే
దయాలుతా తేఽవతు సర్వదాఽస్మాన్ ౨౧
అహహ విస్మర నాథ న మాం సదా
కరుణయా నిజయా పరిపూరితః
భువి భవాన్ యది మే న హి రక్షకః
కథమహో మమ జీవనమత్ర వై ౨౨
దహ దహ కృపయా త్వం వ్యాధిజాలం విశాలం
హర హర కరవాలం చాల్పమృత్యోః కరాలమ్
నిజజనపరిపాలం త్వాం భజే భావయాలం
కురు కురు బహుకాలం జీవితం మే సదాఽలమ్ ౨౩
క్లీం శ్రీం క్లీం శ్రీం నమో భగవతే జనార్దనాయ సకలదురితాని నాశయ నాశయ క్ష్రౌం ఆరోగ్యం కురు కురు హ్రీం దీర్ఘమాయుర్దేహి స్వాహా  ౨౪

ఫలశ్రుతిః

అస్య ధారణతో జాపాదల్పమృత్యుః ప్రశామ్యతి
గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనం పరమ్ ౨౫
సర్వే రోగాః ప్రశామ్యన్తి సర్వా బాధా ప్రశామ్యతి
కుదృష్టిజం భయం నశ్యేత్ తథా ప్రేతాదిజం భయమ్ ౨౬
ఇతి సుదర్శనసంహితోక్తం అమృతసఞ్జీవన ధన్వన్తరి స్తోత్రమ్

సూర్యదేవర వేణుగోపాల్ 
మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా




Saturday, March 28, 2020

కరోన వైరస్- చదవాల్సిన స్తోత్రాలు











ప్రస్తుతం కరోన వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. హిందూ ధర్మ శాస్త్రాలలో ఇంకా గ్రంధాల్లో ఇటువంటి ఆపత్కర విపత్తులను అరికట్టడానికి ఎన్నో తరుణోపాయాలు సూచించారు. ఇటువంటి రోజుల్లో ఏయే స్తోత్రాలు చదవాలో ఈ క్రింద ఉదహరిస్తున్నాను. ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ఈ స్తోత్రాలను ఉదయం, సాయంత్రం పఠించండి. ఇవి స్వ రక్షణ తో పాటు దేశ రక్షణ కూడా ఉపకరిస్తాయి. పూర్తి నమ్మకం తో పఠించండి... ఈ స్తోత్రాలు అన్ని స్తోత్ర పుస్తకాలలో ఉంటాయి, లేకపోతే నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


అన్నిటికన్నా ముఖ్యమైనది సంధ్యావందనం. సంధ్యావందన అర్హత ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీనిని ఆచరించాలి. గాయత్రి మంత్రాన్ని విడిగా కాకుండా సంధ్యావందనం లో చేస్తే మంచి లాభం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు కాబట్టి రోజు సహస్ర గాయత్రి చేస్తే దేశానికి మేలు చేసినవారౌతారు. వీలుంటే  త్రిసంధ్యలు ఆచరించండి. లేకపోతే కనీసం ఉదయ సంధ్య, సాయం సంధ్యలలో ఆచరించండి. గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి అంటే జపసంఖ్యను పెంచండి. 11,24 కాకుండా 108,508,1008 లు గా చేయండి. మీకూ మంచిది దేశానికి మంచిది. ఈ విపత్తు నుండి త్వరగా విముక్తి వస్తుంది. సంధ్యావందన అర్హత ఉన్నవార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగిలినవారు వేరే స్తోత్రాలు పఠించవచ్చు.


అందరూ విధిగా ప్రతిరోజూ "ఆదిత్య హృదయ "స్తోత్రాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా చదవండి. "ఆరోగ్యం భాస్కారాదిచ్చేత్"  అని మన గ్రంధాలు చెప్తున్నాయి. ఆరోగ్యం కోసం సూర్య భగవానుని ఆరాధించాలి. కరోన వైరస్ నుండి ప్రపంచాన్ని రక్షించమని ప్రతిరోజూ రవిని ఆరాధించాలి. అన్ని వర్ణాల వారు ఆదిత్య హృదయమును పఠించవచ్చు.


"శీతలా దేవి"  అన్ని రకాల విపత్తుల నుండి భూమిని కాపాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ అందరూ రోజుకు రెండుసార్లు " శ్రీ శీతలా  దేవి స్తోత్రం" ను పారాయణం చేయాలి.  పఠించేవారిని వారి చుట్టూ ఉన్న పరిసరాలను ఈ తల్లి అన్ని ఆనారోగ్య విపత్తుల నుండి రక్షిస్తుంది.


అన్ని విపత్తులకు రక్షణ "శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం" ఇది చాలా మహిమా కలిగినది. శ్రీవిద్యా సాంప్రదాయంలో అగ్రగణ్యమైనది. దీనిని రోజు రెండు సార్లు చదువుతూ ఉంటే స్వీయ రక్షణ సంఘ రక్షణ రెండు జరిగుతాయి. అన్ని సమస్యల నుండి విపత్తుల నుండి తన భక్తులను నిరంతరం కాపాడుతూ ఉంటుంది.  అయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని గురు ముఖంగా నేర్చుకొని పారాయణం చేయాలి.  తప్పులు లేకుండా చదవాలి. ఎందుకంటే అతి నిగూఢమైన శ్రీవిద్యా రహస్యాలు. ఇందులో పొందుపర్చబడినవి.


ఇంకా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ సుదర్శన మాహా స్తోత్రం, శ్రీ ఆంజనేయ బడబాలన స్తోత్రం, శ్రీ వారాహి స్తోత్రం, శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం మొదలగు స్తోత్రాలని ఎవరికి వీలైనవి వారు ఇంట్లో ఉండే చదివితే మంచి ప్రయోజనం ఉంటుంది.

"మహా మృత్యుంజయ మంత్రం, రుద్రం, మన్యు సూక్తం" వంటివి ఈ సమయాలలో చదవడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం కూడా చాలా మంచిది.


ఈ సమయం లో "చండీ సప్తశతి" చాలా ముఖ్యం.  ఈ సంప్రదాయం లో ఉన్నవారు వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణం చేయడం మంచిది. చండీ దయ ఉంటే ఎటువంటి విపత్తు సంభవించదు. ప్రభుత్వం వారు కూడా దేవాలయాల్లో "చండీ హోమం"  ప్రతి రోజు చేయించడం మంచిది.  ఎక్కువ దేవాలయాలలో రోజు చేయించాలి.


ప్రతి రోజు "శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం" లేదా "దుర్గా స్తోత్రం" "కాళి స్తోత్రం" "కాళి కవచం" ఇంకా "శ్రీ దత్త పంజర స్తోత్రం" లేదా "శ్రీ దత్త సహస్రనామ స్తోత్రం" చదువుతూ ఉంటే అన్నీ విపత్తుల నుండి రక్షణ కలుగుతుంది.

ఇవే కాకుండా కుల దేవత ఆరాధన చేయడం మంచిది. ఇష్ట దేవత ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.

పైన ఉదహరింపబడినవి ఎవరికి వీలైనవి వారు చదివి కరోన వైరస్ నుండి అందర్నీ రక్షించమని పరమాత్మని వేడుకుందాం.