Sunday, August 11, 2019

నైరుతి వీధి శూల


నైరుతి వీధి శూల

వీధి శూల అంటే వీధి యొక్క చూపు లేక పోటు అని అర్ధం.  సాధారణం గా వీధి శూల మేలు చేయదు. అయితే ఈశాన్య వీధిశూల మేలు చేస్తుంది... పడమర వాయవ్యం, దక్షిణ ఆగ్నేయం వీధి పోటు కూడా మంచివే. నష్టాలను ఇవ్వవు. అన్నిటికన్నా నైరుతి వీధి శూల చాలా ప్రమాదం.
గృహ యజమాని, యజమానురాలు ఇంకా పెద్ద సంతానం పై దీని ప్రభావం అధికం. కుటుంబం మొత్తం కూడా ఈ వీధి శూల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. దక్షిణ నైరుతి వీధి శూల వల్ల గుండె జబ్బులు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ లో మృతి చెందడం... యజమాని ఉద్యోగం లేదా వృత్తిలో తీవ్ర సమస్యలు పొందడం, ఇంకా అనైతిక మైన పనులు చేసి పరువును పోగొట్టుకోవడం వంటివి జరగగలవు...
పడమర నైరుతి వీధిశూల స్త్రీల పై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది.. ప్రవర్తన దోషాలు, గుండె జబ్బులు. వృత్తిలో సమస్యలు, అధిక ఖర్చు, ప్రమాదాలు  జరగగలవు.
మొత్తం మీద గమనిస్తే నైరుతి వీధి శూల ప్రమాదాలను, గుండె జబ్బులను, వృత్తిలో సమస్యలను ఇంకా వివాహం లేట్ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం, మగ సంతానం లేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయి..ఈ వీధిశూల కుటుంబం మొత్తాన్ని వేధిస్తుంది. ముఖ్యంగా యజమాని, యజమానురాలు ఇంకా పెద్ద సంతానం జాగ్రత్తగా ఉండాలి...
ఈ వీధి శూలను వెంటనే సవరించాలి... నిర్లక్ష్యం చేయరాదు..


సూర్యదేవర వేణుగోపాల్... M. A (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్ ... మధిర
ఖమ్మం జిల్లా 507203
Venusuryadevara@gmail.com


Sunday, July 14, 2019

ది.16- 7- 2019 చంద్ర గ్రహణం

ది. 16- 7- 2019 , మంగళవారం తెల్లవారితే 17- 7- 2019 బుధవారం, ఆషాఢ శుక్ల పౌర్ణిమ ఉత్తరాషాఢ నక్షత్రం ప్రధమ చరణములో కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది..

గ్రహణ సమయ వివరాలు...

గ్రహణ స్పర్శ కాలం     అర్ధరాత్రి  గం: 01:34 ని...లకు

గ్రహణ మధ్య కాలం     రాత్రి తె|| ఝాా గం..03:03 ని..లకు

గ్రహణ మోక్ష కాలం       రాత్రి..తె|| ఝా గం..04:27..ని.


ఇది కేతు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం

ఈ గ్రహణమును ధను, మకర రాశుల వారు ఇంకా గర్భిణీ స్త్రీలు చూడరాదు

గ్రహణం అర్ధరాత్రి నందు సంభవించుట వలన నిత్య భోజన ప్రత్యాభ్దికములు , గ్రహణ విడుపు స్నానాలు , శుద్ది కార్యక్రమములు బుధవారం ఉదయం చేయవచ్చు.మంత్ర పఠనములు లలిత, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం మంచి ఫలితాలు ఇవ్వగలవు



సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)

సుందరయ్య నగర్ , మధిర

ఖమ్మం జిల్లా తెలంగాణా

507203

venusuryadevara@ gmail.com


ఇంట్లో చెట్లు - వాస్తు జాగ్రత్తలు

వాస్తు ప్రకారం ఇంట్లో పెద్ద వృక్షాలు లేదా చెట్లు ఇంటికి పడమర, దక్షిణ ఇంకా నైరుతి దిక్కులందు వేయాలి. పెద్ద చెట్లు నైరుతి లో ఉండటం చాలా మంచిది. పూల మొక్కలు మధ్యమ ఎత్తులో ఉండే మొక్కలు వాయవ్య, ఆగ్నేయ ఇంకా తూర్పు ఉత్తర దిశలందు ఉంచవచ్చు. తూర్పున గాని ఉత్తరం దిక్కున గాని ఇంటి కంటే ఎత్తు పెరిగే చెట్లను ఉంచరాదు. తూర్పు వైపు ఉన్న పెద్ద వృక్షాల వలన ఇంట్లో మగవారు ఇంకా మగ పిల్లలు జీవితంలో ఎదగలేరు. వారికి కలిసి రాదు. ఇంకా ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులను బాధిస్తాయి. ఉత్తరం లో వేసిన పెద్ద చెట్ల వలన ఆర్ధిక సమస్యలు వస్తాయి. ఇంట్లో ఉండే ఆడ పిల్లలకు సకాలం లో వివాహం కాదు. వ్యాపారం లో నష్టాలు వస్తాయి. పిల్లలకు చదువు లో సమస్యలుంటాయి.

ఇంటి ఆవరణ లో మొక్కలు గాని చెట్లను గాని వేసే సమయం లో కొన్ని వాస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. .....పెద్ద చెట్లను ఎట్టి పరిస్థితి లో తూర్పు ఉత్తర ఇంకా ఈశాన్య ప్రాంతం లందు వేయ రాదు. ఈ చెట్లను దక్షిణం  పడమర ఇంకా నైరుతి దిక్కులందు మాత్రమే వేయాలి....

తూర్పు ఉత్తర దిక్కులందు పూల మొక్కలను, కూరగాయ మొక్కలను వేయవచ్చు. కూరగాయ మొక్కలకు పందిళ్ళు వేయవలసి వస్తే అప్పుడు వాయవ్య ఆగ్నేయ దిక్కులందు ఉంచాలి. పెద్ద చెట్లను ఎట్టి పరిస్థితిలోను ఈ దిక్కులందు వేయరాదు. పెద్ద చెట్లు ఈ దిక్కులందు ఉంటే అనేక సమస్యలొస్తాయి.

ఈశాన్యం లో ఎటువంటి మొక్కలు లేదా చెట్లు లేకుండా ఉండాలి. ఈ దిక్కులో పెద్ద వృక్షాలు ఉంటే వంశ నష్టం జరుగుతుంది. మగ సంతానానికి కష్టలుంటాయి. ఇంకా ఆర్ధిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వంటి రోగాలు రావొచ్చు. ఈశాన్యం లో చిన్న పూల మొక్కలు, ఆకు కూరలు వంటివి ఉంచవచ్చు.

చెట్లు బావికి  లేదా బోర్ వెల్  కి ఎదురుగా ఉండకూడదు. అదేవిధంగా ద్వారాలకు ఎదురుగా ఉండకూడదు. ఇంకా ఇంటి పిల్లర్ లేదా గోడలకు ఎదురుగా ఉండకూడదు. చెట్లు ప్రహరికి అమర్చే gates కి ఎదురుగా ఉండకూడదు.

తులసి మొక్కను ఇంటి ద్వారం ఎదురుగా ఉంచాలి. ఈశాన్యంలో కూడా ఉంచవచ్చును. తులసి మొక్కను 4 ప్రధాన దిక్కులలో ఎక్కడైనా వేయవచ్చు. అయితే తూర్పు, ఉత్తర ఇంకా ఈశాన్య భాగాలలో ఉంచే సందర్భం లో తులసి కోట ను తక్కువ ఎత్తు లో ఉంచాలి. బాగాఎత్తులో ఉంచకూడదు.


ఈ విధమైన వాస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.


సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)

సుందరయ్య నగర్ , మధిర
ఖమ్మం జిల్లా  తెలంగాణా
507203
venusuryadevara@gmail.com





Sunday, May 12, 2019

పూజ గది- వాస్తు నియమాలు

పూజ గది- వాస్తు నియమాలు


గృహం లో పూజ ఈశాన్యం నందు చేయడం మంచిది. ఉత్తర ఈశాన్యం గాని లేదా తూర్పు ఈశాన్యం లో గాని పూజ చేయడం శ్రేష్టం. పూజ ఎప్పుడు తూర్పు దిక్కునకు అభిముఖంగా అంటే తూర్పు వైపు తిరిగి పూజ చేయాలి.  తూర్పు ముఖంగా పూజ చేసే వీలు లేనప్పుడు ఉత్తర ముఖంగా పూజ చేయవచ్చు. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా చేసే పూజలు మంచి ఫలితాలనిస్తాయి. కోరికలు ఫలిస్తాయి. పడమర ముఖంగా గాని లేదా దక్షిణ ముఖంగా చేసే పూజలు అంతగా ఫలితాలను ఇవ్వవు. అందువల్ల ఈ దిక్కులకు ఎదురుగా కూర్చుని పూజ చేయ కూడదు. పడమర దిక్కు అభిముఖంగా చేసే పూజలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. దక్షిణ ముఖ పూజ అధమం.

ఈశాన్యం దిక్కును పూర్తిగా మూసివేస్తూ పూజ గదిని నిర్మించరాదు. గృహానికి ఈశాన్యం లో తప్పనిసరిగా ద్వారం ఉండాలి. ఈ దిక్కును మూసివేయ రాదు. ఈ దిక్కు లో బరువులు ఉంచరాదు. ఈశాన్యం లో పూజ ఉన్నప్పుడూ పెద్ద మందిరాలు కానీ బరువు కలిగిన వస్తువులు కానీ ఉంచరాదు.

పూజ వలన ఈశాన్య దిక్కును మూసివేయ రాదు. ఈశాన్యం లో పూజ వలన ఈ దిక్కును మూసివేయ వలసి వస్తే, పూజ ను తూర్పు దిక్కులో కానీ లేదా ఉత్తర దిక్కు నందు కానీ చేయవచ్చు. అంటే తూర్పు లేదా ఉత్తర దిశలందు పూజ గది ని నిర్మించి పూజ చేయవచ్చు.

కొంతమంది తూర్పు లేదా ఉత్తరం లందు పెద్ద హాల్స్ నిర్మించి, ఈ హాల్స్ లో పూర్తి ఈశాన్యం లో పూజ గది నిర్మించి ఈశాన్యం ను మూసి  వేస్తున్నారు. ఇది వాస్తు కు విరుద్దం.

ఈశాన్యం లో పూజ మంచిదని ఈశాన్యం దిక్కును ఎప్పుడు మూసివేయకూడదు  బరువులు ఉంచకూడదు. ఈ విధ మైన అమరిక వలన అనేక సమస్యలు వస్తాయి. ఈశాన్యం దిక్కు కు ఇబ్బంది కలగనప్పుడు మాత్రమే పూజను ఈశాన్యం లో చేయాలి.  ఈశాన్యం దిక్కు కు పూజ వలన బరువు పెరిగి, మూత వేయవలసి వచ్చినప్పుడు, పూజ ను తూర్పున గాని లేదా ఉత్తరం దిక్కులందు చేయాలి. ఇది మాత్రమే మంచి పద్దతి.


సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్  మధిర
తెలంగాణా.

Suryadevara Venugopal: పూజ గది.- వాస్తు నియమాలు.

Suryadevara Venugopal: పూజ గది.- వాస్తు నియమాలు.: పూజ గది- వాస్తు నియమాలు గృహం లో పూజ ఈశాన్యం నందు చేయడం మంచిది. ఉత్తర ఈశాన్యం గాని లేదా తూర్పు ఈశాన్యం లో గాని పూజ చేయడం శ్రేష్టం...