Saturday, March 3, 2018

సర్వాపన్నివారణకు సుందర కాండ

నవగ్రహ దోష నివారణకు వాల్మీకి రామాయణం లోని సుందరకాండ కల్పతరువు గా చెప్పబడింది. మానవ జీవితం లోని వివిధ సమస్యల నివారణకు శ్రీ సుందరకాండ పారాయణం గొప్ప నివారణ గా మన పూర్వీకులు సూచించారు. ఇప్పటికీ మన హిందూ సంస్కృతి లో సుందరకాండకు విశేష మైన ప్రాముఖ్యత ఉంది. అనేక ఆపద నివారణకు సుందరకాండ పారాయణం దివ్యఔషధం గా అనేక పూర్వ గ్రంధాలు, మహర్షులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అనేకులు ఈ దివ్య మైన సుందర కాండ ను ఒక నిర్దుష్టమైన పద్దతిలో పారాయణం చేసి అనేక సమస్యల నుండి విముక్తిని పొందుతున్నారు.

సుందర కాండను ఏ విధంగా పారాయణం చేయాలి, ఏ సమస్యకు ఏ సర్గను పారాయణం చేయాలి  అనే విషయాలను తెలుసుకొని పారాయణం చేస్తే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి.  ఏ సమస్యకు ఏ సర్గ పారాయణం చేయాలో  తెలుసుకుందాం.....


భూత ప్రేత భయ నివారణకు అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు సుందరకాండ లోని 3 వ సర్గ "లంక విజయం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.


సంపద వృద్దికి అనేక ఆర్ధిక సమస్యల నివారణకు 15 వ సర్గ  "లంకలో సీతాదేవి దర్శనం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.

పీడకలలు అనేక భయ నివారణకు  27 వ సర్గ " త్రిజట స్వప్నం" ను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.

కోప నివారణకు సాత్విక గుణ వృద్దికి 21 వ సర్గ  " సీతా రావణ సంవాదం" ను 11 రోజుల పాటు పారాయణం చేయాలి.

ఎడబాసిన బంధు సమాగమానికి  33 వ సర్గ నుండి 44 వ సర్గ వరకు  "సీతా హనుమత్ సంవాదం ను " కనీసం 2 మండలాల పాటు పారాయణం చేయాలి.

సర్వాపన్నివారణకు  36 వ సర్గ  " అంగళీయక ఘట్టం " ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.

శత్రువు ల పై  జయానికి 42 వ సర్గ నుండి 47 వ సర్గ " హనుమంతులవారు వివిధ రాక్షస సంహారం" ఘట్టాలను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.

గృహ వృద్దికి అనేక స్థిరాస్థి వృద్దికి 54 వ సర్గ "లంక దహన ఘట్టం" ను 3 మండలాలు పాటు పారాయణం చేయాలి.

సకల అభీష్ట సిద్దికి 41 వ సర్గ  "అశోక వన ధ్వంసం" ఘట్టం ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.

పుత్ర సంతానం కోసం సప్త సర్గ పారాయణం 68 రోజులందు పారాయణం చేయాలి.

వివాహ సిద్దికి 9 రోజులలో సుందరకాండ మొత్తము ను పారాయణం చేయాలి.

విద్యా సమస్యలకు మొత్తం  సుందర కాండ ను 7 రోజులందు పారాయణం చేయాలి.

శీఘ్ర ఉద్యోగ ప్రాప్తికి  మొత్తం సుందర కాండ ను 9 లేదా 11 రోజులలో పారాయణం చేయాలి.

అనేక సమస్యలకు, ఆపదలకు ,వేదనలకు మొత్తం సుందర కాండ ను ఒకే రోజు లో పారాయణం చేయాలి.

నైవేద్యం గా పాయసం, పులిహోర, అప్పాలు, చక్కెర పొంగలి  లేదా యధా శక్తి గా నివేదించాలి.

ఆవుపాలు, అరటిపండ్లు తప్పనిసరి.

పారాయణానికి  ముందు  గాని  తరువాత గాని,శ్రీ రామరక్ష స్తోత్రం తప్పనిసరిగా పాటించాలి. ప్రతిరోజూ పారాయణం అనంతరం హనుమత్ పూజ ను చేయాలి.

పూర్తి పారాయణం ముగిసిన పిదప యధాశక్తి అన్నదానం చేసిన మంచి ప్రయోజనం కలుగుతుంది.


venusuryadevara@gmail. com

సూర్యదేవర వేణుగోపాల్ M. A (జ్యోతిష్యం)

H. NO.  1-879

సుందరయ్య నగర్   మధిర

ఖమ్మం జిల్లా  తెలంగాణా
507203

No comments:

Post a Comment