Thursday, May 10, 2018

పూజ గది - వాస్తు నియమాలు

వాస్తు ప్రకారం పూజ ను ఈశాన్యం లో చేయడం ఉత్తమం. తూర్పు ఈశాన్యం లో గాని ఉత్తర ఈశాన్యం లోగాని పూజ చేయడం శ్రేష్టం.

అయితే కొన్ని సందర్భాలలో ఈశాన్యం నందు పూజ మేలు చేయక పోగా నష్టాలను కలిగించే వీలుంది. ఎలాగంటే చాలామంది ఈశాన్యం లో పూజా చేయాలని ఈశాన్యం ను పూర్తిగా మూసివేసి గదులను నిర్మిస్తున్నారు. దీనివలన ఈశాన్యం లో బరువు పెరుగుతుంది. నేడు చాలా గృహాలలో తూర్పు ఉత్తర దిక్కులందు పెద్దగా హాల్స్ నిర్మించి ఈశాన్యం లో పూజా గదిని నిర్మిస్తున్నారు. దీనివలన ఈశాన్యం మూసిన దోషం కలుగుతుంది. ఇటువంటి అమరిక వలన సింహద్వారం లేదా సాధారణమైన ద్వారం అయినా ఈశాన్యం లో అమర్చడానికి వీలు ఏర్పడదు. ఇటువంటి సందర్భాలలో పూర్తి ఈశాన్యం లో కాకుండా తూర్పు మధ్యకు లేదా ఉత్తరం మధ్యకు వచ్చే విధంగా పూజను ఏర్పాటు చేయాలి

ఈశాన్యం లో బరువు కానంత వరకు పూజ ను అక్కడ చేయడం మంచిదే. అయితే ఈశాన్యం లో బరువు అయితే తూర్పు లేదా ఉత్తరం దిక్కులలో ఏర్పాటు చేయాలి.

పూజ ను ఎల్లప్పుడు తూర్పు ముఖంగా తిరిగి చేస్తే మంచిది. ఉత్తర ముఖంగా కూడా చేయవచ్చు.

పడమర ముఖంగా చేయడం మధ్యమం  దక్షిణ ముఖం గా చేయడం అధమం.

వంట గది కి  ఈశాన్యం వైపు చేయవచ్చు.

దేవుని ఫోటోలు ఏ దిక్కునైనా చూస్తూ ఉండవచ్చు

పూజించేవారు తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని ఉండాలి.

విశేష పూజలు వ్రతాలు హాల్స్ నందు తూర్పు ముఖంగా చేయాలి.

సంధ్యావందన క్రియను ఆచరించేవారు  ఉదయం తూర్పు ముఖంగా  సాయంత్రం పడమర ముఖంగా కూర్చుని ఆచరించాలి.


సూర్యదేవర వేణుగోపాల్  M.A. జ్యోతిష్యం
1-879  సుందరయ్య నగర్
మధిర  ఖమ్మం జిల్లా
తెలంగాణ   507203

No comments:

Post a Comment