సమగ్ర వాస్తు,జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర, యోగా విశ్లేషణ........ సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
Tuesday, December 25, 2018
Sunday, September 2, 2018
Wednesday, August 15, 2018
Thursday, May 10, 2018
Vastu Velugu @ Suryadevara Venugopaal: పూజ గది - వాస్తు నియమాలు
Vastu Velugu @ Suryadevara Venugopaal: పూజ గది - వాస్తు నియమాలు: వాస్తు ప్రకారం పూజ ను ఈశాన్యం లో చేయడం ఉత్తమం. తూర్పు ఈశాన్యం లో గాని ఉత్తర ఈశాన్యం లోగాని పూజ చేయడం శ్రేష్టం. అయితే కొన్ని సందర్భాలలో ఈశాన...
పూజ గది - వాస్తు నియమాలు
వాస్తు ప్రకారం పూజ ను ఈశాన్యం లో చేయడం ఉత్తమం. తూర్పు ఈశాన్యం లో గాని ఉత్తర ఈశాన్యం లోగాని పూజ చేయడం శ్రేష్టం.
అయితే కొన్ని సందర్భాలలో ఈశాన్యం నందు పూజ మేలు చేయక పోగా నష్టాలను కలిగించే వీలుంది. ఎలాగంటే చాలామంది ఈశాన్యం లో పూజా చేయాలని ఈశాన్యం ను పూర్తిగా మూసివేసి గదులను నిర్మిస్తున్నారు. దీనివలన ఈశాన్యం లో బరువు పెరుగుతుంది. నేడు చాలా గృహాలలో తూర్పు ఉత్తర దిక్కులందు పెద్దగా హాల్స్ నిర్మించి ఈశాన్యం లో పూజా గదిని నిర్మిస్తున్నారు. దీనివలన ఈశాన్యం మూసిన దోషం కలుగుతుంది. ఇటువంటి అమరిక వలన సింహద్వారం లేదా సాధారణమైన ద్వారం అయినా ఈశాన్యం లో అమర్చడానికి వీలు ఏర్పడదు. ఇటువంటి సందర్భాలలో పూర్తి ఈశాన్యం లో కాకుండా తూర్పు మధ్యకు లేదా ఉత్తరం మధ్యకు వచ్చే విధంగా పూజను ఏర్పాటు చేయాలి
ఈశాన్యం లో బరువు కానంత వరకు పూజ ను అక్కడ చేయడం మంచిదే. అయితే ఈశాన్యం లో బరువు అయితే తూర్పు లేదా ఉత్తరం దిక్కులలో ఏర్పాటు చేయాలి.
పూజ ను ఎల్లప్పుడు తూర్పు ముఖంగా తిరిగి చేస్తే మంచిది. ఉత్తర ముఖంగా కూడా చేయవచ్చు.
పడమర ముఖంగా చేయడం మధ్యమం దక్షిణ ముఖం గా చేయడం అధమం.
వంట గది కి ఈశాన్యం వైపు చేయవచ్చు.
దేవుని ఫోటోలు ఏ దిక్కునైనా చూస్తూ ఉండవచ్చు
పూజించేవారు తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని ఉండాలి.
విశేష పూజలు వ్రతాలు హాల్స్ నందు తూర్పు ముఖంగా చేయాలి.
సంధ్యావందన క్రియను ఆచరించేవారు ఉదయం తూర్పు ముఖంగా సాయంత్రం పడమర ముఖంగా కూర్చుని ఆచరించాలి.
సూర్యదేవర వేణుగోపాల్ M.A. జ్యోతిష్యం
1-879 సుందరయ్య నగర్
మధిర ఖమ్మం జిల్లా
తెలంగాణ 507203

Saturday, March 3, 2018
సర్వాపన్నివారణకు సుందర కాండ
నవగ్రహ దోష నివారణకు వాల్మీకి రామాయణం లోని సుందరకాండ కల్పతరువు గా చెప్పబడింది. మానవ జీవితం లోని వివిధ సమస్యల నివారణకు శ్రీ సుందరకాండ పారాయణం గొప్ప నివారణ గా మన పూర్వీకులు సూచించారు. ఇప్పటికీ మన హిందూ సంస్కృతి లో సుందరకాండకు విశేష మైన ప్రాముఖ్యత ఉంది. అనేక ఆపద నివారణకు సుందరకాండ పారాయణం దివ్యఔషధం గా అనేక పూర్వ గ్రంధాలు, మహర్షులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అనేకులు ఈ దివ్య మైన సుందర కాండ ను ఒక నిర్దుష్టమైన పద్దతిలో పారాయణం చేసి అనేక సమస్యల నుండి విముక్తిని పొందుతున్నారు.
సుందర కాండను ఏ విధంగా పారాయణం చేయాలి, ఏ సమస్యకు ఏ సర్గను పారాయణం చేయాలి అనే విషయాలను తెలుసుకొని పారాయణం చేస్తే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సమస్యకు ఏ సర్గ పారాయణం చేయాలో తెలుసుకుందాం.....
భూత ప్రేత భయ నివారణకు అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు సుందరకాండ లోని 3 వ సర్గ "లంక విజయం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
సంపద వృద్దికి అనేక ఆర్ధిక సమస్యల నివారణకు 15 వ సర్గ "లంకలో సీతాదేవి దర్శనం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
పీడకలలు అనేక భయ నివారణకు 27 వ సర్గ " త్రిజట స్వప్నం" ను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.
కోప నివారణకు సాత్విక గుణ వృద్దికి 21 వ సర్గ " సీతా రావణ సంవాదం" ను 11 రోజుల పాటు పారాయణం చేయాలి.
ఎడబాసిన బంధు సమాగమానికి 33 వ సర్గ నుండి 44 వ సర్గ వరకు "సీతా హనుమత్ సంవాదం ను " కనీసం 2 మండలాల పాటు పారాయణం చేయాలి.
సర్వాపన్నివారణకు 36 వ సర్గ " అంగళీయక ఘట్టం " ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
శత్రువు ల పై జయానికి 42 వ సర్గ నుండి 47 వ సర్గ " హనుమంతులవారు వివిధ రాక్షస సంహారం" ఘట్టాలను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.
గృహ వృద్దికి అనేక స్థిరాస్థి వృద్దికి 54 వ సర్గ "లంక దహన ఘట్టం" ను 3 మండలాలు పాటు పారాయణం చేయాలి.
సకల అభీష్ట సిద్దికి 41 వ సర్గ "అశోక వన ధ్వంసం" ఘట్టం ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
పుత్ర సంతానం కోసం సప్త సర్గ పారాయణం 68 రోజులందు పారాయణం చేయాలి.
వివాహ సిద్దికి 9 రోజులలో సుందరకాండ మొత్తము ను పారాయణం చేయాలి.
విద్యా సమస్యలకు మొత్తం సుందర కాండ ను 7 రోజులందు పారాయణం చేయాలి.
శీఘ్ర ఉద్యోగ ప్రాప్తికి మొత్తం సుందర కాండ ను 9 లేదా 11 రోజులలో పారాయణం చేయాలి.
అనేక సమస్యలకు, ఆపదలకు ,వేదనలకు మొత్తం సుందర కాండ ను ఒకే రోజు లో పారాయణం చేయాలి.
నైవేద్యం గా పాయసం, పులిహోర, అప్పాలు, చక్కెర పొంగలి లేదా యధా శక్తి గా నివేదించాలి.
ఆవుపాలు, అరటిపండ్లు తప్పనిసరి.
పారాయణానికి ముందు గాని తరువాత గాని,శ్రీ రామరక్ష స్తోత్రం తప్పనిసరిగా పాటించాలి. ప్రతిరోజూ పారాయణం అనంతరం హనుమత్ పూజ ను చేయాలి.
పూర్తి పారాయణం ముగిసిన పిదప యధాశక్తి అన్నదానం చేసిన మంచి ప్రయోజనం కలుగుతుంది.
venusuryadevara@gmail. com
సూర్యదేవర వేణుగోపాల్ M. A (జ్యోతిష్యం)
H. NO. 1-879
సుందరయ్య నగర్ మధిర
ఖమ్మం జిల్లా తెలంగాణా
507203

Sunday, January 21, 2018
31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం
31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం
మాఘ శుద్ధ పౌర్ణిమ బుధవారం, ది. 31-01-2018 పుష్యమి నక్షత్ర కర్కాటక రాశి యందు
రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ..........
గ్రహణ స్పర్శ కాలం సాయంత్రం గం|| 05:17 ని|లకు....
గ్రహణ మధ్యకాలం రాత్రి గం|| 06:58 ని|లకు....
గ్రహణ మోక్ష కాలం రాత్రి గం|| 08:41 ని|లకు
గ్రహణ ఆద్యంత పుణ్యకాలం.... గం|| 03:24 ని||లు
ఈ గ్రహణం భారత దేశం అంతా గోచరించును. ఇది కర్కాటక రాశియందు పట్టుట వలన పుష్యమి, ఆశ్లేష రాశి వారు చూడకూడదు.
అన్ని నియమాలు ఆచరించాలి.
గ్రహణానంతరం స్నానం చేసి భోజనాదికాలు చేయాలి.
మంత్రానుష్టానం కలవారు ఈ పుణ్యకాలం నందు మంత్రానుష్టానం చేయుట మంచిది.
శ్రీకాళహస్తి లో కాలసర్పదోషం కలవారు రాహు-కేతు పూజ జరిపించిన విశేష ఫలం లభిస్తుంది...
venusuryadevara@gmail.com
సూర్యదేవర వేణుగోపాల్ M.A. (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్ మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా.
507203
Subscribe to:
Posts (Atom)